![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్ 10 కి రంగం సిద్దమవుతోంది. ఇక దానికోసం అగ్నిపరీక్ష సీజన్ 2 మొదలైంది. ఎంపిక ప్రక్రియలో భాగంగా కొంతమంది కంటెస్టెంట్స్ ని ఎంపిక చేశారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రష్టి అంటే డూ ఆర్ డై టాస్కుతో అందరికి గుర్తుండిపోయింది. ఇక ఒక టాస్క్ ఇస్తారు. ఎక్స్‌కి ఫోన్ చేసే టాస్క్ వస్తుంది. దీపక్, రోహిత్, గాయత్రి అందరూ గంట పట్టుకున్నారు కానీ ఎవరి ఫోన్ కూడా లిఫ్ట్ అవ్వలేదు. చివరకు ఛాన్స్ శ్రష్టికి వచ్చింది. ఆ అమ్మాయి ఏమాత్రం ఆలోచించకుండా మాజీకి కాల్ చేసేసింది. నాదే తప్పు, సారీ, ఐ లవ్యూ, నువ్వు లేకుండా నేను లేను అని డైరెక్ట్‌గా చెప్పేసింది. అవతలి నుంచి సైలెంట్ రిప్లై వచ్చినా, తను మాత్రం.. ఇలా సడెన్‌గా కాల్ చేయడం నా తప్పే అని కట్ చేసేసింది.
ఫోన్ పెట్టేసిన తర్వాత శ్రష్టి చెప్పిన మాటలే హైలైట్ అయ్యాయి. ఈగో పక్కన పెట్టి చేశాను. నేను నిజంగానే ప్రేమించాను. నేనే వాడిని లైఫ్ నుంచి వెళ్లిపోమని అన్నాను. వాడు మళ్లీ నాకు ఫోన్ చేయడని నాకు తెలుసని క్లీన్‌గా చెప్పింది. అంటే తప్పు తనది కాకపోయినా, సంబంధాన్ని కాపాడుకోవడానికి ఫస్ట్ స్టెప్ తనే వేసింది. అది చాలా పెద్ద విషయం కదా. సాధారణంగా ఎవరూ అంత ఈజీగా ఈగో దిగిరారు.
శ్రీముఖి, అభిజిత్, బిందు, నవదీప్ అందరు కూడా స్టేజ్ మీద .. సూపర్ శ్రష్టి, గ్రేట్ అని పొగిడేశారు. తప్పు చేసినా చేయకపోయినా, వద్దనుకున్న మనిషికి ఫోన్ చేసి మాట్లాడడం అంత ఈజీ కాదున్నారు. అలా శ్రష్టి ఆ ఎమోషనల్ టాస్క్‌తో టాప్ 15లో స్థానం కూడా కొట్టేసింది. నిజంగా ఆ క్షణంలో చాలా మంది ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యుంటారు. మరి తను చేసిన ఈ టాస్క్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
![]() |
![]() |